
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్‌సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్‌లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు.
