
చిత్తూరు జిల్లా: పాలసముద్రం మండలంలో ఎర్రమట్టి గ్రావెల్‌ను గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచరులు తమిళనాడుకు తరలించుకుని దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర నేత చిట్టిబాబు వర్గానికి చెందిన కూటమి నాయకులు సోమవారం ఎర్రమట్టి గ్రావెల్ తీసుకెళ్లుతున్న ప్రదేశంలో సీపీఐ నేతలతో కలసి ధర్నా చేపట్టారు.
మండలంలో ఎమ్మెల్యే అనుచరులు ఐదు, ఆరు నెలలుగా తమిళనాడు సరిహద్దులోని ఎర్రమట్టిని టిప్పర్‌లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నిరసిస్తూ చిట్టిబాబుతో సహా పలువురు టీడీపీ, సీపీఐ నేతలు నిరసనలు, ధర్నా చేశారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయాల్సిన ఎమ్మెల్యే.. పచ్చని గుట్టలను దొచుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. అనంతరం వారు తహశీల్దార్‌కు వినతిపత్రమిచ్చారు.