‘పవన్‌ ఫ్లెక్సీని తొలగించండి’.. టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం | TDP-Janasana Clash Over Pawan Kalyan Flexis in Prakasam District | Sakshi
Sakshi News home page

‘పవన్‌ ఫ్లెక్సీని తొలగించండి’.. టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం

Sep 1 2026 3:25 PM | Updated on Sep 1 2026 4:00 PM

TDP-Janasana Clash Over Pawan Kalyan Flexis in Prakasam District

సాక్షి,దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన స్థానిక నాయకులు దర్శిలో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీల ఏర్పాటును స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే వాటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులను రంగంలోకి దింపి ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. దీనిని గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో పాటు టీడీపీ నేతల యత్నాలను అడ్డుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement