ఇరాన్‌ అధ‍్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ | PM Modi meets Iran President in Bishkek | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అధ‍్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ

Aug 31 2026 3:58 PM | Updated on Aug 31 2026 4:09 PM

PM Modi meets Iran President in Bishkek

బిష్కెక్‌: ఇరాన్‌ అధ‍్యక్షుడు పెజెష‍్కియాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్‌ సదస్సు సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ-పెజెష్కియాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

సోమవారం సాయంత్రం రష్యా అధ్యకక్షుడు పుతిన్‌తో కూడా మోదీ సమావేశం కానున్నారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభ వేడుకలో పుతిన్‌ ఆయన పాల్గొంటారు.

అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. ''బిష్కెక్‌లో జరుగుతున్న ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో సమావేశం జరిగింది. రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో భారత్–అర్మేనియా సహకారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని కూడా మేము విశ్వసిస్తున్నాం'' అని మోదీ తెలిపారు.

కాగా, కిర్గిజిస్థాన్ రక్షణ అధికారులు, కిర్గిజ్ రిపబ్లిక్ మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని మీడియాకు తెలిపారు. భారత్–కిర్గిజిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిర్గిజిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కెప్టెన్ తాలైబెక్ మాట్లాడుతూ.. “ప్రధాని మోదీని కలవడం మాకు జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఆయన ఇక్కడ కిర్గిజిస్థాన్‌కు రావడం గొప్ప విషయం” అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement