మాట వినకపోతే కాల్చి పారేస్తా | Education Minister Basavaraja Rayareddy Fire On Officers | Sakshi
Sakshi News home page

మాట వినకపోతే కాల్చి పారేస్తా

Sep 9 2026 10:56 AM | Updated on Sep 9 2026 11:02 AM

Education Minister Basavaraja Rayareddy Fire On Officers

బెంగళూరు: మొన్నటికి మొన్న ఇస్లాం మతాన్ని పొగుడుతూ హజ్‌ యాత్రకు వెళ్లాలని ఆశగా ఉందని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి ఈసారి మాట వినని అధికారులను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా గున్నాళ గ్రామంలో జరిగిన జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారి మాట వినడో నాకు చెప్పండి, ఆ అధికారిని కాల్చి పారేస్తానంటూ ఆగ్రహించారు. యలబుర్గ తహసీల్దార్‌ ప్రకాష్‌ను వేదికపైకి పిలిచి తాను మంత్రి బాధ్యతల్లో పూర్తిగా బిజీగా ఉంటా, నువ్వే నా పీఆర్‌ఓగా పని చేయాలంటూ సూచించారు. తమ ప్రభుత్వంలోని గ్యారెంటీ పథకాలు ఎప్పటిలా కొనసాగుతాయన్నారు. 

చదవండి: కంగనా సీరియస్‌.. కేంద్రాన్ని అడుక్కోవాలా అంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement