ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ | Delhi building collapse SC to hear on Sept 10 PG operator, wife sent to judicial custody | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ

Sep 8 2026 4:48 PM | Updated on Sep 8 2026 5:28 PM

Delhi building collapse SC to hear on Sept 10 PG operator, wife sent to judicial custody

సాక్షి, న్యూఢిల్లీ:  డిల్లీలోని సత్య నికేతన్‌లో భవనం కూలిపోయిన ఘటనలో సుప్రీంకోర్టు  స్పందించింది. దీనిపై సెప్టెంబర్ 10న విచారించనుంది. అలాగే ఈ ఘటనపై దాఖలైన అత్యవసర ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అధికారుల స్పందనను కోరుతూ పలు మార్గదర్శకాలను, ఆదేశాలను జారీ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి సౌత్ జోన్‌కు చెందిన ఐదుగురు అధికారులను (డిప్యూటీ కమిషనర్ రాకేష్ గుప్తాతో సహా) మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సస్పెండ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ   హాస్టల్‌  యజమాని, 81 ఏళ్ల హరిరామ్ గుప్తా, భార్యను  పాటియాలా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.  

ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టూ ఉన్న ప్రమాదకరమైన భవనాలకు MCD కూల్చివేత నోటీసులు జారీ ప్రక్రియను ప్రారంభించింది. కూలిపోయిన భవనానికి ఆనుకుని ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉన్న మరో భవనంతోపాటు మరికొన్ని భవనాలను పరిశీలిస్తున్నామని MCD సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: నో జిమ్‌, సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌?

మరోవైపు బాధితులు  గాయపడిన వారి కుటుంబాలను రేఖా గుప్తా  ఆసుపత్రిలో పరామర్శించారు.  చికిత్స ఖర్చును ఎన్‌సిటి (NCT) ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. ప్రమాదకరమైన మరో భవనాన్ని బుధవారం కూల్చివేస్తామని కూడా ఆమె పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్‌, కీలక వ్యాఖ్యలు

ఈ ఘటన అనంతరం పారిపోతున్న పీజీ యజమానిని హరిరామ్‌ రాజస్థాన్‌లోని భివాడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఓనర్‌తోపాటు, అతని భార్య ఊర్మిళా గుప్తా (75), కుమారుడు మహేష్ గుప్తా (52)లను కూడా అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement