అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్‌ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.
-బెంగళూరు


