breaking news
Orangutan babies
-
ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్
5 Baby Orangutans అంతరించిపోతున్న అరుదైన ఐదు ఒరంగుటాన్లు (Orangutans) ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో దర్శనమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌కు చెందని వీటిని బిచిత్రపూర్ అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు వదిలి వెళ్లినట్టుగా భావిస్తున్నారు. సాధారణంగా ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, మలేసియా అడవుల్లో కనిపిస్తాయి. దీంతో అసలివి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు స్మగ్లింగ్ చేశారు అనే కోణంలో అధికారులు ముమ్మర విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలోని కీలక అంశాలు వెలుగు చూశాయి.ఒరంగుటాన్లు లభించిన రాత్రి అడవి సమీపంలో తిరిగిన ఒక నల్లటి మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనం సీసీటీవీ దృశ్యాలలో కనిపించింది. రాత్రి 11:25 గంటలకు వెళ్లి, తిరిగి 15 నిమిషాల తర్వాత ఆ వాహనం రావడంపై అధికారులు దృష్టి సారించారు.ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) రంగంలోకి దిగింది.#WATCH | Five rescued Orangutans brought to Nandankanan Zoo in Bhubaneswar, kept in quarantine.(Video source: Nandankanan Zoo) https://t.co/Yl7TEJx0cm pic.twitter.com/THuhiLpugJ— ANI (@ANI) September 9, 2026ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం మరోవైపు రక్షించిన ఒరంగుటాన్లను భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూకి తరలించి క్వారంటైన్లో ఉంచారు. వీటి ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే జాతీయ వన్యప్రాణి నిపుణులను కూడా పిలిపించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో ఒరంగుటాన్ విలువ సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని ఒడిశా అటవీ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ఖుంటియా తెలిపారు. ఇవి విమాన, జల లేదా రైలు మార్గాల ద్వారా వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని వన్యప్రాణి నేరాల నిరోధక బ్యూరో (WCCB)ని మంత్రి కోరారు. <Five young orangutans rescued from Odisha’s Bichitrapur casuarina forest.Forest officials reportedly found the animals apparently abandoned in the coastal forest of Balasore district, raising serious questions about how a species not native to Odisha reached the area.… pic.twitter.com/8Wwo7BfyzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 9, 2026ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది! -
మేమూ బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటాం!
స్కూల్ బస్సు రాగానే పిల్లలు పరుగెత్తుతూ పోయి బస్సెక్కడం మనం చూస్తూనే ఉంటాం. చిత్రంలో కనిపిస్తున్న ఒరాంగుటాన్ పిల్లలు కూడా తొట్టెలో కూర్చొని ఎంచక్కా బడికి పోతాయి. ఒరాంగుటాన్లు స్కూలుకి పోవడమేంటనుకుంటున్నారా! నిజమేనండీ బాబూ.. ఇండోనేషియాలోని కెటపాంగ్లో ఉన్న అంతర్జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంలో వీటికోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను తెరిచారు. అక్కడ ఈ పిల్ల ఒరాంగుటాన్‌లకు చెట్లెక్కడంతో పాటు ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే వాటిపై శిక్షణ ఇస్తారు. దీంతోపాటు అడవిలో అపాయాలను ఎదుర్కొని ఎలా జీవించాలనే దానిపై మెలకువలు నేర్పిస్తారు. ఈ స్కూల్లో 102 ఒరాంగుటాన్ పిల్లలున్నాయి. వీటిలో అత్యధికం అనధికారికంగా పెంచుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నవే! ఇంత వరకూ మనుషుల మధ్య తిరగటం, గొలుసులతో బంధించి చిన్న చిన్న బోనుల్లో ఉంచటం వల్ల ఇవి చెట్లెక్కడానికి భయపడుతున్నాయని శిక్షకులు చెబుతున్నారు. ఒరాంగుటాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని, వీటి సంరక్షణపై దృష్టి పెట్టకపోతే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉందని ప్రొగ్రాం డెరైక్టర్ కర్మెలీ లెల్నో సంచీజ్ పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత వీటిని అడవిలో విడిచి పెడతామన్నారు.


