టిఫిన్‌ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర! | Dhurandhar actor Akshaye Khanna Simple Diet and Fitness Routine at 50 | Sakshi
Sakshi News home page

Akshaye Khanna: 50 ఏళ్లలో ఫిట్‌గా.. రెండు పూటలే భోజనం.. సింపుల్‌ డైట్‌!

Apr 4 2026 1:48 PM | Updated on Apr 4 2026 3:02 PM

Dhurandhar actor Akshaye Khanna Simple Diet and Fitness Routine at 50

రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్‌ అవొద్దని అంటుంటారు. కానీ, తాను అదే స్కిప్‌ చేస్తానంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా. ఛావా, ధురంధర్‌ సినిమాలతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయిపోయాడు అక్షయ్‌. అతడి యాక్టింగ్‌కు ప్రేక్షక జనం ఫిదా అయింది. 

చిన్నవయసులోనే బట్టతలతో బాధపడినప్పటికీ, దాన్నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్నాడు. లుక్స్‌తో కాకుండా టాలెంట్‌తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటూ పోతూ తన సత్తా చూపించాడు. కెరీర్‌లో ఫుల్‌ బిజీగా మారిన ఈ నటుడి లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దాం.. 

నో స్నాక్స్‌
అక్షయ్‌ ఖన్నా కేవలం రెండుపూటలే భోజనం చేస్తాడు. ఉదయం అల్పాహారం జోలికి వెళ్లడు. మధ్యాహ్నం, రాత్రిపూట మాత్రం తనకు నచ్చింది తినేస్తాడు. అలా అని మధ్యలో ఖాళీ దొరికితే బిస్కెట్లు, సాండ్‌విచ్‌లు తినే టైపు కాదు, కేవలం ఛాయ్‌ తాగుతాడంతే! ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడతాడు. అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్‌, చేపలు, ఏదైనా నాన్‌వెజ్‌.. ఇవే ఆయన మెనూలో తరచూ కనిపిస్తుంటాయి. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ ఆరగిస్తాడు.

మంచి నిద్ర ముఖ్యం
తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మొదటి ప్రాధాన్యతనిస్తాడు. ఇంట్లో ఉన్నా, సెట్‌లో ఉన్నా ఇవే ఆహారపద్ధతులను కొనసాగిస్తుంటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్‌ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా చెప్పాడు. అన్నింటికన్నా మంచి నిద్ర అవసరం అంటుంటాడు. రోజుకు 10 గంటలు నిద్రపోతాడు. అలసిన శరీరం, మనసుకు ఊరటనిచ్చేది నిద్రేనంటాడు. మరీ నోరు కట్టేసుకోకుండా సింపుల్‌ డైట్‌తోనే ఐదు పదుల వయసులోనూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు అక్షయ్‌.

చదవండి: మతిస్థిమితం కోల్పోయిన భానుప్రియ? స్పందించిన చెల్లెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement