ఈ బ్యానర్‌లో నాకు నాలుగో హిట్‌: శర్వానంద్‌ | Sharwanand Says Biker Movie is His Career Best Film | Sakshi
Sakshi News home page

Sharwanand: నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలిం ఇది.. ప్రభాస్‌ అన్నకు థాంక్స్‌

Apr 4 2026 8:30 AM | Updated on Apr 4 2026 9:23 AM

Sharwanand Says Biker Movie is His Career Best Film

‘‘బైకర్‌’ ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం... తీశాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రం ‘బైకర్‌’. నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ అని గర్వంగా చెబుతాను’’ అని హీరో శర్వానంద్‌ తెలిపారు. శర్వానంద్, మాళవికా నాయర్‌ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. 

ప్రభాస్‌ అన్నకి థాంక్స్‌
అదే రోజు సాయంత్రం నిర్వహించిన బంపర్‌ బ్లాక్‌ బస్టర్‌ మీట్‌లో శర్వానంద్‌ మాట్లాడుతూ–‘‘బైకర్‌’ని సపోర్ట్‌ చేసిన ప్రభాస్‌ అన్నకి థాంక్స్‌. ఈ చిత్రకథని నా వద్దకు పంపిన నిర్మాత వంశీ అన్నకి థ్యాంక్స్‌. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్‌. ‘రన్‌ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, మహానుభావుడు, బైకర్‌’. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. బైకర్‌ క్యారెక్టర్‌ కోసం  22 కిలోలు బరువు తగ్గాను. ‘బైకర్‌’ని యూత్‌ చూస్తున్నారు. ఇది ప్యూర్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ‘బైకర్‌’కి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

రెండేళ్ల కష్టం
‘‘బైకర్‌’కి వస్తున్న స్పందన చూసి చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది రెండేళ్ల కష్టం’’ అన్నారు మాళవిక. ‘‘ఈ సినిమాలో బైక్‌ రేసింగ్‌తో పాటు ఒక బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంటుందని చెప్పాను. ఆడియన్స్‌ ఆ ఎమోషన్‌కు కనెక్ట్‌ అయ్యారు’’ అని అభిలాష్‌ రెడ్డి పేర్కొన్నారు. నటుడు రాజశేఖర్, నటి జీవిత, డైరెక్టర్‌ సంపత్‌ నంది, కెమెరామెన్‌ యువరాజ్, నటుడు నిరూప్‌ నందకుమార్, ఎడిటర్‌ అనిల్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement