ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్‌ | Abhishek Bachchan Says Marriage with Aishwarya Rai Bachchan is Based on Equality | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: నేను సంపాదిస్తా.. నువ్వు ఇంటిని చూసుకో అనలేదు.. మామధ్య ఇగో..

Apr 4 2026 9:09 AM | Updated on Apr 4 2026 9:32 AM

Abhishek Bachchan Says Marriage with Aishwarya Rai Bachchan is Based on Equality

హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్‌ బచ్చన్‌. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్‌. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. 

కెరీర్‌ ప్రారంభంలోనే..
ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్‌గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్‌ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్‌ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్‌లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. 

అలాంటి వ్యక్తిని కాను
నా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్‌ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్‌ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. 

పెళ్లి
ఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్వర్య రాయ్‌ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్‌- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.

చదవండి: నాలో సీమ ఫీలింగ్‌ ఉంది: విజయ్‌ దేవరకొండ

Advertisement
 
Advertisement
Advertisement