తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..? | Health Tips: Myths and facts about eggs | Sakshi
Sakshi News home page

తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?

Apr 4 2026 3:32 PM | Updated on Apr 4 2026 4:10 PM

Health Tips: Myths and facts about eggs

కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్‌ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.

నమ్మకాలు        

కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.

తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.

గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.

నిజాలు

పచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. 

తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.

గుడ్లు తింటే కొలెస్ట్రాల్‌ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం  ఆరోగ్యానికి హానికరం.

ఆరోగ్యంగా ఉన్నవారు  రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .

(చదవండి: జస్ట్‌ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!)
 

Advertisement
 
Advertisement
Advertisement