ఇరాన్‌ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం? | Iran war USA F35 the worlds most advanced jet failed in Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం?

Apr 4 2026 7:38 PM | Updated on Apr 4 2026 8:08 PM

Iran war USA F35 the worlds most advanced jet failed in Iran

ఇరాన్‌పై  అమెరికా-ఇజ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధంలో ఇరాన్‌ ఇప్పటివరకు ఎఫ్-35 రెండు  యుద్ధ విమానాలను  కూల్చివేయడం సంచలనం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన జెట్‌గా ప్రచారంలో ఉన్న  ఎఫ్-35, ఇరాన్‌లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలో విఫలమైందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.  మరోవైపు ఎఫ్-35 ప్రత్యేకత దాని స్టెల్త్ టెక్నాలజీ. ఇరాన్‌తో అమెరికా యుద్ధంలో ఇది రెండుసార్లు  ఫెయిల్‌ కావడంతో ఆ టెక్నాలజీపైనే ప్రశ్నలు తలెత్తాయి. ఇంతటి అత్యాధునిక విమానాలను ఎలా కూల్చగలిగింది? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రతి దాడుల్లో ఎఫ్-35 ఫైటర్  తుస్సు మందా?  అసలేంటీ  దీని  కథ?

ఇరాన్‌పై యుద్ధంలో ఎఫ్-35 ఫైటర్ ప్రతిష్టకు దెబ్బ

శుక్రవారం ఇరాన్ చేసిన ప్రకటనల ప్రకారం,  రెండో ఎఫ్-35ను కూల్చివేశాయి.(అంతకుముందు, మార్చి 19న). దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను కోల్పోవడం లేదా దెబ్బతినడం అనేది డబ్బు పరంగా, ప్రతిష్ట పరంగా కూడా ఒక పెద్ద దెబ్బ. ఎఫ్-35 లైట్నింగ్ అనేది ఐదవ తరం స్టెల్త్ జెట్. ఇది శత్రు రాడార్లకు దాదాపు కనిపించకుండా, సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ, ఇతర విమానాలు, భూతల దళాలతో ప్రత్యక్ష సమాచారాన్ని పంచుకునేలా తయారుచేశారు. కానీ స్టెల్త్ జెట్ సామర్థ్యాలపై, ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా అతివిశ్వాసంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది .ఇరాన్‌తో అమెరికా సంఘర్షణలో, అమెరికా అతివిశ్వాసమే అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.


కెనడా పునరాలోచన
ప్రధాన సంస్థలైన లాక్‌హీడ్ మార్టిన్ , నార్త్‌రోప్ గ్రుమ్మన్, ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందిన ఎఫ్-35 జెట్‌ను నిర్మించాయి, కానీ దాని ప్రతిష్ట ఎంతగా దెబ్బతిందంటే, అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయాలనే తన ప్రణాళికను కెనడా సమీక్షిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, విడిభాగాల లభ్యత వంటి అంశాల వల్ల కెనడా ఆందోళన చెందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఇరాన్‌లో జెట్‌లు, అత్యాధునిక రాడార్లు విఫలమైన తర్వాత, అమెరికన్ రక్షణ పరికరాలపై ఆధారపడటం గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. యుద్ధం కొనసాగు తున్నందున, జెట్‌లు ఎలా దెబ్బతిన్నాయనే దానిపై విచారణ కొనసాగుతోంది.  కానీ ప్రస్తుతానికి, యుద్ధభూమిలో  కొన్ని ఊహించని దెబ్బల నేపథ్యంలో F-35 కేవలం కాగితాలమీదే టాపర్‌గా భావించాల్సి వస్తోంది.ఘ

ఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్‌ దెబ్బ , ట్రంప్‌నకు భారీ షాక్‌

 

ఎఫ్-35  ఫీచర్స్‌
F-35 అనేది ఒకే సీటు, ఒకే ఇంజిన్ కలిగిన యుద్ధ విమానం. దీని ప్రాట్ & విట్నీ ఇంజిన్ సుమారు 43,000 పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గంటకు 1,200 మైళ్ల వేగమైన మాక్ 1.6ను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని రెక్కల విస్తీర్ణం సుమారు 35 అడుగులు . ఇది కేవలం అంతర్గత ఇంధనంతోనే 1,350 మైళ్లకు పైగా ప్రయాణించగలదు. గాలిలోనే ఇంధనం నింపుకోవడంతో, దీని పరిధి దాదాపు అపరిమితం .దీని టెక్నాలజీ కారణంగా శత్రువులు  దీన్ని గుర్తించడం,  లాక్ చేయడం కష్టమని భావించారు, కానీ ఇరాన్  దీన్ని పటాలపంచలు చేసింది.

ఎఫ్-35లో  శక్తివంతమైన సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి రాడార్, ఇన్‌ఫ్రారెడ్ , ఇతర వ్యవస్థల నుండి డేటాను మిళితం చేసి, పైలట్‌కు యుద్ధభూమి స్పష్టమైన 360-డిగ్రీల చిత్రాన్ని అందిస్తాయి. స్టెల్త్ రూపాన్ని స్పష్టంగా ఉంచడానికి ఈ జెట్ బాడీ లోపల ఆయుధాలను మోయగలదు. చెప్పాలంటే ఎఫ్-35 రహస్యంగా చొరబడి, కచ్చితంగా దాడి చేసి, సురక్షితంగా బయటపడగలదు.  విధానాన్ని బట్టి,ఈ ఎఫ్-35 విమానాల ఖరీదు 82 నుండి 110 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.

ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్‌ : గూగుల్‌లోని‌ ఈ పాలసీ తెలుసా?

మరి ఈ టాప్‌ జెట్‌ను ఇరాన్ ఎలా కూల్చింది?
రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్‌ వాయు రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైనవి కానప్పటికీ ఇరాన్, అధిక ఎత్తులకు చేరుకోగల , రాడార్ లేదా ఇన్‌ఫ్రారెడ్ ఉపయోగించి లక్ష్యాలను ట్రాక్ చేసే, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. ముఖ్యంగా 'మజిద్' ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా భుజంపై ఉంచుకుని ప్రయోగించే క్షిపణులను వాడుతోంది ప్రధానంగా  ఇవి రాడార్లకు చిక్కవు. అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వీటి ద్వారా లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. గత మార్చి 19న శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్-35ను దెబ్బతీసింది కూడా ఈ మజిద్ వ్యవస్థేనని భావిస్తున్నారు. F-35లకు సరిసమానమైన యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద లేకపోయినా, అది ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలదు.  టెహ్రాన్‌ పని అయిపోయింది, ఇరాన్‌ గగనతలం మాదే అన్న మార్చి 24న ట్రంప్‌ అతివిశ్వాస ప్రకటన అమెరికాకే ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement