breaking news
F-35 jets
-
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్‌ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్‌కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
హమ్మయ్యా..! అత్యంత ఖరీదైన యుద్ధ విమానం.. గాల్లోకి లేచింది..!
తిరువనంతపురం: గత నెల 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీ యుద్ధ విమానం ఎఫ్-35 ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. 37 రోజుల తర్వాత యుద్ధ విమానం తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైంది. తొలుత ఈ యుద్ధ విమానాన్ని తిరిగి మరమ్మత్తులు చేయడం కష్టమని భావించారు. విడిగా పార్ట్లు తీసి తీసుకెళ్లాల్సిందేనని నిపుణులులు తేల్చారు. అయితే ఈ యుద్ధ విమానాన్ని తిరిగి పట్టాలక్కెంచేందుకు యూకే నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసి చూశారు. అది సత్ఫలితాల్ని ఇవ్వడంతో ఆ యుద్ధ విమానం తిరిగి గాల్లోకి ఎగిరింది. అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడ్డారు. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఈ నెల తొలి వారంలో తిరువనంతపురంలో అడుగుపెట్టారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించడంతో ఆ విమానం విడిభాగాల్ని తొలగించాలనే అంశానికి ఫుల్‌స్టాఫ్ పడింది. కాగా, బ్రిటన్‌కు చెందిన నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. ఆ క్రమంలోనే జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. తాజాగా ఆ యుద్ధ విమానం గాల్లోకి లేపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో యూకే నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.అత్యంత ఖరీదైన విమానం..F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంతంటే..?తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 37 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు రూ. కోటి అంతకంటే ఎక్కువ అవుతుందనే అంచనా వేస్తున్నారు. -
కేరళలో బ్రిటిష్ ఎఫ్ 35 జెట్ ఎపిసోడ్.. మరో కీలక మలుపు
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.నిపుణుల బృందం.. ఆర్ఏఎఫ్ జెడ్ఎం 417 , ఏయిర్‌బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జెట్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్‌తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం
త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ నేవీ యుద్ధ విమానం ఎఫ్–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్ బ్రిటీష్ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్ స్నాగ్ కారణంగా ఉండిపోయిన ఎఫ్–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది. ఫైటర్ జెట్‌ను భారత్‌లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్ కోసం బ్రిటన్ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్–35బి జూన్ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్‌కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. కానీ హైడ్రాలిక్ వైఫల్యంతో జెట్ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్‌లోని బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్‌ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. జోరుగా మీమ్స్ బ్రిటన్ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్లైన్లో జోరుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్‌ను కేవలం 4 కోట్లకే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్‌కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్ వైరలవుతున్నాయి. -
అణుఫైటర్ల కొనుగోలు
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు. కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.స్వాగతించిన నాటో.. ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
India-U.S relations: ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
వాషింగ్టన్: ట్రంప్ 2.0తో మోదీ 3.0 తొలి భేటీ బంపర్ హిట్టయింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెండింతలకు పెంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా భారత్‌కు అమెరికా అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను అందజేయడమే గాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇతోధికంగా పెంచనుంది. భారీగా చమురు, సహజవాయువు కూడా సరఫరా చేయనుంది. ఇరు దేశాలూ పౌర అణు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటన(Usa Tour)లో భాగంగా అధ్యక్షునితో మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం. మోదీని ట్రంప్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. చాలాసేపటిదాకా కరచాలనం చేయడమే గాక ప్రధానిని గట్టిగా హత్తుకున్నారు. ‘మీరో అద్భుతమైన వ్యక్తి. గొప్ప మిత్రుడు. మిమ్మల్నెంతగానో మిస్సయ్యాం’ అంటూ అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భారత్, అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత 44 నిమిషాల పాటు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. అమెరికాకు మోదీ చిరకాల మిత్రుడంటూ మీడియా ముఖంగా కూడా ట్రంప్ పదేపదే ప్రశంసించారు. భారీ వర్తక ఒప్పందం: ట్రంప్ చైనాతో పాటు పలు దేశాలపై దూకుడైన టారిఫ్‌ల యుద్ధం ప్రకటించిన ట్రంప్, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు. కాకపోతే పరస్పర టారిఫ్‌ల విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడబోమని మోదీ సమక్షంలో ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై భారత్ విధించే సుంకాలనే తామూ విధించి తీరతామన్నారు. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా హెచ్చుగా, ఏకపక్షంగా ఉన్నాయంటూ సంయుక్త మీడియా భేటీలోనే ఆక్షేపించారు. అయితే, అమెరికా నుంచి చమురు, సహజవాయువు దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచేందుకు మోదీ సమ్మతించారని అధ్యక్షుడు వెల్లడించారు. ఆ రెండింట్లో భారత్‌కు తామే అతి పెద్ద సరఫరాదారులం కాబోతున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు రక్షణ హార్డ్‌వేర్ తదితర ఉత్పత్తుల ఎగుమతులను ఈ ఏడాది నుంచి ఏటా బిలియన్ డాలర్ల మేరకు పెంచనున్నాం. అంతేగాక ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లను భారత్‌కు అందజేస్తాం. భారత్‌తో అతి త్వర లో భారీ వర్తక ఒప్పందం కుదరనుంది. పౌర అణు ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇందులో భా గంగా అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత్ తన మార్కెట్లలోకి అనుమతించనుంది’’ అని వెల్లడించారు. భారత్–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్ దిశగా కృషి చేయాలని అంగీకారానికి వచ్చామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ–8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది. పదేళ్లకు రోడ్‌మ్యాప్: మోదీ భారత్, అమెరికా పరస్పర సహకారాత్మక బంధం మెరుగైన ప్రపంచానికి బాటలు పరుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకుంటామని చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. 2025ను అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభివర్ణించారు. ‘‘అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారు. ఇది నేనెంతగానో అభినందించే విషయం. భారత ప్రయోజనాలకు నేను కూడా అంతే’’ అని వివరించారు. వ్యాపారవేత్త గౌతం అదానీ వివాదంపై ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా వ్యక్తులను గురించి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు. చైనాతో లద్దాఖ్ వివాదాన్ని ప్రస్తావించగా సరిహద్దు ఘర్షణలు ఎవరికీ మంచివి కావని అభిప్రాయపడ్డారు. ట్రంప్ జోక్యం చేసుకుని చైనా, భారత్, రష్యా, అమెరికా కలసికట్టుగా సాగాలని అభిలషించారు. ట్రంప్‌తో భేటీ అద్భుతంగా సాగిందని అనంతరం మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన భారత్ బయల్దేరారు. ముంబై దోషుల్ని శిక్షించాల్సిందే ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించింది. దాన్ని రూపుమాపేందుకు సంయుక్తంగా పోరాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ఆ దాడుల్లో నిందితుడైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత హింసాత్మక వ్యక్తుల్లో ఒకరిని భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ముంబై ఉగ్ర దాడులకు పాల్పడ్డందుకు అక్కడ న్యాయ విచారణను ఎదుర్కొంటాడు. త్వరలో మరికొందరిని కూడా అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను తదితరులకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలిచ్చారు. రాణా అప్పగింత పట్ల అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా తొలినుంచీ కలసికట్టుగా పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ముంబై తరహా దాడులను నివారించేందుకు, అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థల ఆట కట్టించేందుకు సంయుక్త కృషిని కొనసాగిస్తామని ఇరు దేశాల సంయుక్త ప్రకటన కూడా పేర్కొంది. పాక్ మూలాలున్న రాణా కెనడా జాతీయుడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో ఉన్నాడు. భారత్‌లో అమెరికా వర్సిటీల క్యాంపస్‌లు పలు ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలు త్వరలో భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని కూడా నిశ్చయించారు. ఇందుకోసం పరస్పర సంయుక్త డిగ్రీలు తదితర పథకాలతో పాటు జాయింట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షలకు పై చిలుకు భారత విద్యార్థుల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్ల దాకా అందుతోందని నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని భారత సమాజానిది ఇరు దేశాల బంధంలో అతి కీలక పాత్ర అని మీడియా భేటీలో ట్రంప్ చెప్పారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్ నగరాల్లో త్వరలో భారత కాన్సులేట్లు తెరవనున్నట్టు వెల్లడించారు.మానవ అక్రమ రవాణాపై పోరు: మోదీ మనుషుల అక్రమ రవాణా భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ప్రపంచ సమస్యగా అభివరి్ణంచారు. పెద్ద కలలు కనే సాధారణ కుటుంబాలకు చెందిన అమాయకులను పరాయి దేశాల్లో అక్రమ వలసదారులుగా మారుస్తున్న ఈ జాఢ్యంపై దీనిపై దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. ‘‘పరాయి దేశంలో అక్రమంగా ప్రవేశించే వారెవరికీ అక్కడ నివసించే హక్కుండబోదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు తేలిన భారతీయులందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. ఈ అంశం ట్రంప్–మోదీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు.తటస్థం కాదు, శాంతివైపే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ శాంతివైపే నిలిచింది తప్ప ఏనాడూ తటస్థ వైఖరితో వ్యవహరించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై కొన్ని దేశాలకు ఉన్న అభిప్రాయం అపోహ మాత్రమేనన్నారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దౌత్యమే మార్గం తప్ప యుద్ధం కాదు. ఈ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నా. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పా’’ అని చెప్పారు.బేరాల్లో నాకన్నా మొనగాడు: ట్రంప్ట్రంప్, మోదీ సంయుక్త మీడియా సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, పలు సందర్భాల్లో సరదా మాటలతో సాగింది. ఇద్దర్లో ఎవరు మెరుగ్గా బేరమాడతారని మీడియా ప్రశ్నించగా ఆ విషయంలో మోదీదే పై చేయంటూ ట్రంప్ టక్కున బదులిచ్చారు. ‘‘మోదీ నా కంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు. ఆయనతో పోటీ కూడా పడలేను. అందులో అనుమానమే లేదు’’ అంటూ నవ్వులు పూయించారు. భేటీ పొడవునా మోదీని అధ్యక్షుడు పదేపదే ప్రస్తుతించారు. ‘‘ఆయనో గొప్ప నాయకుడు. ప్రధానిగా అద్భుతంగా రాణిస్తున్నారు. దేశాధినేతలతో పాటు ఎవరిని చూసినా ఆయన గురించే మాట్లాడతారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ మోదీ, నేను ఎంతో సమయం కలిసి గడిపాం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందమైన భారతదేశంలో ఐదేళ్ల కింద పర్యటించా. నా భార్య మెలానియాతో కలిసి అద్భుతమైన సమయం గడిపా. అప్పుడు మోదీ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడాయనకు అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు మోదీకి మరోసారి స్వాగతం పలికినందుకు ఎంతో థ్రిల్లవుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలో పర్యటించిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఉన్నారు.మాగా.. మిగా కలిస్తే మెగా ట్రంప్ నినదించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ–మాగా) స్ఫూర్తితో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (ఎంఐజీఏ–మిగా) నినాదం ఇస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండూ కలిసి మెగా భాగస్వామ్యంగా మారతాయని ధీమా వెలిబుచ్చారు.మిషన్ 500భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భా గంగా పరస్పర సుంకాలను బాగా తగ్గించుకోవాలని, మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించుకోవాలని తీర్మానించాయి. మోదీ–ట్రంప్ భేటీ అనంతరం ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యాంశాలు... → ఈ సంవత్సరాంతానికల్లా ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ) కుదరనుంది. ఇరు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు లోతుగా చర్చిస్తారు. → సైనిక భాగస్వామ్యం, వేగవంతమైన వాణిజ్య, సాంకేతిక బంధం దిశగా అవకాశాలను నిశితంగా పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘కాంపాక్ట్’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తారు. → వస్తువులు, సేవల రంగంతో పాటు అన్నింటా వరక్త వాణిజ్యాలు మరింత వేగవంతం అవుతాయి. → నాసా–ఇస్రో సంయుక్త ఆక్సియోమ్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్లనున్నాడు. → త్వరలో నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌ను ప్రయోగించనున్నాం. → ట్రాన్స్‌ఫారి్మంగ్ ద రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (ట్రస్ట్) పథకం ద్వారా రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధన, అంతరిక్ష తదితర రంగాల్లో ప్రభుత్వాల, ప్రైవేటు స్థాయిలో పరస్పరం మరింత సహాయక సహకారాలు. -
ఆ యుద్ధ విమానాన్ని పైలెట్ గాలిలో ఎలా వదిలేశాడు? నిజంగా ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్-35 గత ఆదివారం తప్పిపోయింది. ఒక రోజు తర్వాత దాని ఆచూకీ లభ్యమయ్యింది. ఈ విషయాన్ని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఫైటర్ జెట్ అదృశ్యమైన తర్వాత దానిని కనుగొనేందుకు స్థానికులు సాయం చేయాలని సంబంధిత అధికారులు కోరారు. సౌత్ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. నివేదిక ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దానిలో లోపం తలెత్తగా పైలట్ దానిని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైటర్ జెట్ నుండి పైలట్ తనను తాను ఎజెక్ట్ చేసినప్పుడు, అతను యుద్ధ విమానాన్ని ఆటో-పైలట్ మోడ్‌లో ఉంచాడు. విమానం నుంచి బయటకు వచ్చిన పైలట్‌ను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అదే సమయంలో గాలిలో ఎగురుతున్న రెండవ ఎఫ్-35 సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చింది. సైనిక అధికారులు అదృశమైన యుద్ధవిమాన శకలాలను గుర్తించారు. 100 మిలియన్ డాలర్ల విలువైన విమానానికి సంబంధించిన శకలాలు గ్రామీణ విలియమ్స్బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికతరహాలోని అమెరికాకు చెందిన మొట్టమొదటి స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు. ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టీల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు అమెరికా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయాన్ని కోరుతూ, జాయింట్ బేస్ చార్లెస్టన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే అతని విజ్ఞప్తి అనంతరం అతనిపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ సంఘటన ఇంకా విచారణలో ఉంది. దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి మేము అదనపు వివరాలను అందించలేకపోతున్నామని తెలిపారు. BREAKING: The pilot ejected out of the $100 million F-35 jet that went missing due to "bad weather" according to the pilot (allegedly). One of the most advanced fighter jets in the world crashed because of bad weather... they think you are dumb. “He’s unsure of where his plane… pic.twitter.com/PNZShVok3M — Collin Rugg (@CollinRugg) September 20, 2023 కాగా ఎఫ్-35 జెట్ యుద్ధ విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 830 కోట్ల రుపాయలు. పైలెట్ తెలిపిన వివరాల ప్రకారం అననుకూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. పైలెట్ తాను నడుపుతున్న విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేక పోయాడని, ఈ విషయాన్ని అతను చార్లెస్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాల్లో చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. కాగా అంతకుముందు ఆగస్టు చివరి వారంలో అమెరికాకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న టీవీ దీవుల్లో శిక్షణ సమయంలో విమానం కూలి ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతకుముందు యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ శాన్ డియాగో సమీపంలో ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా చదవండి: మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి? -
ఎఫ్-35 జెట్లపై ట్రంప్ గగ్గోలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ సోమవారం మరో రక్షణ శాఖ అంశంపై విమర్శలు గుప్పించారు. దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ మార్పులు చేసుకుంటూ వస్తున్న ఎఫ్-35 జెట్ల వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతోందని ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఎఫ్-35 ప్రోగ్రామ్ వ్యయం చేయి దాటి పోతోందని, జనవరి 20 తర్వాత బిలియన్ల డాలర్లను వృథా కానివ్వనని అన్నారు. ట్రంప్ ట్వీట్ తో ఏరోస్పేస్ మార్కెట్ ఒక్కసారిగా 2.6శాతం కుప్పకూలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35లకు 6.1 బిలియన్ డాలర్లను అమెరికా ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ అమెరికా రక్షణ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. The F-35 program and cost is out of control. Billions of dollars can and will be saved on military (and other) purchases after January 20th. — Donald J. Trump (@realDonaldTrump) December 12, 2016