వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.
ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్‌చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్‌ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.
చిన్నపాటి వర్కవుట్లు చాలు..
జిమ్‌లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.
పిల్లలతో కలిసి..
పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్‌నెస్‌కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి.
వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్‌గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి
క్రమం తప్పకుండా..
ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.
వారానికి రెండుసార్లు..
మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.
(చదవండి:


