ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్‌ | Toaster Movie Official Trailer out now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్‌

Apr 4 2026 1:43 PM | Updated on Apr 4 2026 2:59 PM

Toaster Movie Official Trailer out now

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ డైరెక్ట్‌గా విడుదల కానుంది.  ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు నటించారు.   ఈ మూవీని రాజ్‌కుమార్ రావు సతీమణి నటి పత్రలేఖ  కంపా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథ మొత్తం భార్యాభర్తల మధ్య జరగనుందని అర్థం అవుతుంది.  మహా పిసినారి పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఒకరోజు పెళ్లికి వెళ్లిన రాజ్‌ కొత్త జంట కోసం రూ. 5వేలు విలువ చేసే ఒక టోస్టర్‌ను గిఫ్ట​్‌గా ఇస్తాడు. అయితే, పలు కారణాలతో ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో తాను ఇచ్చిన కానుకను తిరిగి ఇవ్వాలని పెళ్లి వారి ఇంటికి వెళ్తాడు. తను గిఫ్ట్‌గా ఇచ్చిన వస్తువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది  పూర్తి స్టోరీలో రివీల్‌ కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement