ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్ | Sunny Deol and Akshaye Khanna latest Movie Ikka Official Trailer | Sakshi
Sakshi News home page

Ikka Official Trailer: ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్

Jun 29 2026 8:02 PM | Updated on Jun 29 2026 8:15 PM

Sunny Deol and Akshaye Khanna latest Movie Ikka Official Trailer

ఓటీటీలో మరో థ్రిల్లర్ మూవీ సందడి చేయనుంది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఇక్కా వచ్చేనెలలో ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రాన్ని కోర్ట్ రూమ్ సస్పెన్స్  డ్రామాగా తెరకెక్కించారు.  ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మర్డర్ కేసు చుట్టే కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ కేసును వాదించే డిఫెన్స్ లాయర్‌గా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌లో కోర్ట్ రూమ్ సీన్స్ ఆసక్తిగా పెంచేస్తున్నాయి. మరి ఈ కేసులో సన్నీ డియోల్ గెలిచారా? అక్షయే ఖన్నా తప్పించుకున్నారా? లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

కాగా.. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement