'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్ | Akshaye Khanna Telugu Movie Mahakali Shooting Completed | Sakshi
Sakshi News home page

Akshaye Khanna: అక్షయ్ ఖన్నా బర్త్ డే.. అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

Mar 28 2026 3:17 PM | Updated on Mar 28 2026 3:27 PM

Akshaye Khanna Telugu Movie Mahakali Shooting Completed

'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్‌గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.

(ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్‌కి అర్థం కావట్లేదు!)

హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ‍ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.

(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్‌.. వ్యక్తిపై కేసు)

Advertisement
 
Advertisement
Advertisement