
'హనుమాన్' సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహాకాళి చిత్రం నుంచి ఒక అప్‌డేట్ ఇచ్చారు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్న నటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మహాకాళి సినిమాని చాలారోజుల క్రితమే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ స్టోరీ మాత్రమే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ ఖన్నా రీసెంట్‌గా వచ్చిన ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుందని ప్రచారం జరుగుతుంది.
In the shadows of gods,
rose the brightest flame of rebellion 🔥
Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025