ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ | Sunny deol Latest Movie Ikka Streaming Date announced on this Ott | Sakshi
Sakshi News home page

Ikka Movie Ott: ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 14 2026 12:09 PM | Updated on Jun 14 2026 12:53 PM

Sunny deol Latest Movie Ikka Streaming Date announced on this Ott

ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.

దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement