Zanziman Ellie: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్‌ హీరో

Zanziman Ellie The Man Dubbed Real Life Mowgli Now Wears A Suit To School - Sakshi

జాతి వివక్షత, కుల వివక్ష.. పేద, ధనిక వంటి కారణంగా చాలామంది నిరాదరణకు గురవ్వడం చూసి ఉంటాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై దూరంగా అడవిలో జీవించాల్సి రావడం అంటే అది అత్యంత అమానుషమే. రువాండాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రూపం కారణంగా నిరాదరణకు గురైనప్పటిక ఒక చానల్‌ సాయంతో మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అతనెవరో ఏంటో చూద్దాం రండి.

(చదవండి: లక్కీ హ్యండ్‌! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!)

రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీని రియల్‌ లైఫ్‌​లో మోగ్లీగా పిలిచేవారు. కారణం అతని రూపం. అయితే ఈ 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ మైక్రోసెఫాలీ అనే రుగ్మతతో బాధపడుతున్నాడు (శిశువు తల ఊహించిన దాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది). ఈ వ్యాధి అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. ఈ రూపం కారణంగా కర్కశత్వానికి, నిరాదరణకు గురయ్యాడు. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఎల్లీ తల్లికి అతను పుట్టక ముందే ఐదుగురు పిల్లలను కోల్పయింది.

ఆమె దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేయగా ఎల్లీ పుట్టాడు. అంతేకాదు ఈ ఒంటరి తల్లి  ఎల్లిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది. అయితే అఫ్రిమాక్స్‌ అనే ప్రాంతీయ టీవి చానల్‌ గో ఫండ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అతనికి మనమందరం సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడూ ఎ‍ల్లీ రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్‌లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు.

పైగా అతని స్కూల్‌ యూనిఫాం అయిన కస్టమ్‌ మేడ్‌ సూట్‌ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. ఈ మేరకు ఎల్లి తల్లి మాట్లాడుతూ..."ఒకప్పుడూ నా కొడుకుని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడూ మా జీవితాలు మారాయి. నా కొడుకు ఆనందంగా స్కూల్‌కి వెళ్తున్నాడు. మాకు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు.

నా బాధలన్నింటిన మీరు ఒక్క నిమిషంలో దూరం చేశారు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయిలే ఎల్లి సూట్‌ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మనం అందరూ కృషి చేస్తే ఇలాంటి వాళ్ల ఎందరికో సాయం చేయగలం అంటూ రకరకలుగా ట్వీట్ చేశారు.

(చదవండి: బాప్‌రే!.. ఆ జంట దొంగలించిన వైన్‌ బాటిల్స్‌ ఖరీదు రూ.3 కోట్లా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top