 
													మనసుకు కష్టంగా అనిపించే, బాధించే  టాక్సిక్ సంబంధాలను వదిలించుకున్న తరువాత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక మహిళలైతే సరికొత్త ఉత్సాహంతో తేజోవంతంగా ఉంటారు. భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా  మీర్జా అదే నిరూపిస్తోంది.
భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో  ఉన్న సానియా ఇంట్రస్టింగ్, సూపర్ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు నేమ్‌ప్లేట్ మార్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం  చేశారు. స్ట్రాంగ్ మమ్మీ అంటూ కమెంట్ చేశారు.
సానియా మీర్జా 2023లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికి రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. సూపర్ మామ్‌లా తన బిడ్డ ఇజాన్‌ను సంతోషంగా ఉంచేందుకు, ఏ లోటూ లేకుండా పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
బిజీ వర్క్ షెడ్యూల్‌లో కూడా కొడుకు ఇజాన్ గురించి తపన పడే సానియా తాజాగా ఇజాన్‌తో అద్భుతమైన జ్ఞాపకాల పిక్స్‌ను ‘ఇది, అది’ అంటూ షేర్ చేసింది. ఇంకా కార్ రైడ్ నుండి , హెయిర్‌కట్ దాకా ఈ సెల్ఫీలుండటం విశేషం.

 
నేమ్‌ప్లేట్‌లో ఇజాన్ 
ముఖ్యంగా నేమ్‌ప్లేట్‌లో ‘సానియా అండ్ ఇజాన్’ అని ఉన్న ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు  ‘చూజ్ టూబీ హ్యాపీ’, ఫ్యూయల్డ్ బై కెఫీన్ అండ్ సర్కాజం’ అని రాసి వున్న విభిన్న కప్పులను కూడా షేర్ చేయడం గమనార్హం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
