
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఈ సినిమాను డిసెంబరు 12న రిలీజ్ చేయనున్నట్లగా మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ ఎమోషనల్ క్యారెక్టర్‌లో రోషన్ నటించాడు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బండి సరోజ్ విలనిజమ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.