జంగిల్‌ బుక్‌ కథతో మరో సినిమా | MOWGLI Trailer Out | Sakshi
Sakshi News home page

‘మోగ్లీ’ ట్రైలర్‌ విడుదల

May 22 2018 11:11 AM | Updated on May 22 2018 12:08 PM

MOWGLI Trailer Out - Sakshi

జంగిల్‌ బుక్‌ సినిమా ఇండియన్‌ స్క్రీన్‌పై సృష్టించిన ప్రభంజనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. కేవలం ఇండియాలోనే 250 కోట్ల వరుకు వసూళ్లు సాధించి సత్తా చాటింది ఈ సినిమా. గ్రాఫిక్స్‌, జంతువులు, చి​న్న పిల్లాడు చేసే విన్యాసాలు ఈ సినిమా పట్ల  ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమా మల్టిప్లెక్స్‌లో భారీ కలెక్షన్లు సాధించింది.

ప్రస్తుతం జంగిల్‌బుక్‌ తరహాలోనే ‘మోగ్లీ’ సినిమా రాబోతోంది. టార్జన్‌ కాన్సెప్ట్‌తో ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. అడివినే ప్రపంచంగా బతికే బాలుడు జన సంచారంలోకి వస్తే ఏవిధమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అరణ్యంలో జంతువులతో ఏర్పడే ప్రేమానురాగాలు, వీటన్నింటికి తోడు మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే గ్రాఫిక్స్‌ మాయాజాలంతో  మన ​ముందుకు రాబోతోంది ‘మోగ్లీ’. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఆండీ సెర్కిస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోహణ్ చంద్‌ మోగ్లీగా నటిస్తుండగా జంతువుల పాత్రలకు క్రిస్టీన్‌ బాలే, కేట్ బ్లాంచెట్‌, నోమీ హేరిస్‌లు గాత్రధానం చేస్తున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్‌ ఫేం ఫ్రిదా పింటో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జంగిల్‌ బుక్‌ ఆధారంగా తెరకెక్కించినా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింత సీరియస్‌గా ఉండనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement