ఓటీటీలో 'మోగ్లీ' సినిమా.. 3 భాషల్లో స్ట్రీమింగ్‌ | Mowgli Movie OTT Streaming Now South Indian Languages | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'మోగ్లీ' సినిమా.. 3 భాషల్లో స్ట్రీమింగ్‌

Jan 22 2026 11:10 AM | Updated on Jan 22 2026 11:23 AM

Mowgli Movie OTT Streaming Now South Indian Languages

యాంకర్‌ సుమ కుమారుడు రోషన్‌ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. గతేడాది డిసెంబరు 13న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించగా.. బండి సరోజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.

మోగ్లీ(Mowgli) సినిమా ఇప్పటికే ఒక ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇతర భాషలకు విస్తరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు  తమిళం, కన్నడ, మలయాళంలో  స్ట్రీమింగ్‌ అవుతుంది. టాలీవుడ్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

కథేంటి..?
మోగ్లీ (రోషన్‌ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్‌ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్‌లో సైడ్‌ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్‌(సాక్షి మడోల్కర్‌)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్‌ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్‌ నోలన్‌(బండి సరోజ్‌ కుమార్‌).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్‌ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్‌ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement