రామాయణతో ఓటీటీ బిగ్‌ డీల్‌.. నో చెప్పిన నిర్మాత! | Namit Malhotra rejected Ramayana ott deal | Sakshi
Sakshi News home page

రామాయణతో ఓటీటీ బిగ్‌ డీల్‌.. నో చెప్పిన నిర్మాత!

Apr 4 2026 8:26 AM | Updated on Apr 4 2026 9:22 AM

Namit Malhotra rejected Ramayana ott deal

రామాయణ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్‌ ఒక వీడియోను షేర్‌ చేసింది. దీంతో సినిమాపై బజ్‌ పెరిగిపోయింది. ఓటీటీ నుంచి కూడా భారీ ఢీల్‌ వచ్చినట్లు సమాచారం. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ఆహార్యం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.  అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌-1  ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా, కన్నడ నటుడు యష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.

రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ  ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్ల వరకు ఓటీటీ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చారట. అయితే ఈ భారీ ఆఫర్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి దీర్ఘకాలిక విలువ, ప్రపంచవ్యాప్త సామర్థ్యంపై మల్హోత్రాకు గట్టి నమ్మకం ఉన్నందువల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. 

రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా, ఈ ప్రాజెక్ట్‌ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మరింత లాభాన్ని పొందవచ్చు అనేది నిర్మాతల వ్యూహమని అంటున్నారు. వెయ్యి కోట్ల ఓటీటీ ఆఫర్‌ను కాదనడంతో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఇంతటి భారీ అంచనాలు ఉండటం వల్లనే రామాయణ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement