'రామాయణ' టీజర్‌ రిలీజ్‌.. అయోధ్య నుంచి అరణ్యం వరకు! | Ramayana Movie Teaser Unveiled On Hanuman Jayanti, Ranbir Kapoor Shines as Lord Rama, Watch Video Inside | Sakshi
Sakshi News home page

విజువల్‌ వండర్‌గా 'రామాయణ' టీజర్‌.. రాముడి లుక్‌ రివీల్‌

Apr 2 2026 10:12 AM | Updated on Apr 2 2026 11:16 AM

Ramayana Movie Glimpse Released on Hanuman Jayanthi

చలనచిత్రపరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'. రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవిగా సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు (ఏప్రిల్‌ 2) హనుమాన్‌ జయంతి సందర్భంగా రామాయణ టీజర్‌ వదిలారు. అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు.. దాన్ని సరిచేసేందుకు ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. 5 వేల ఏళ్లుగా మన హృదయాల్లో కొలువై, మనల్ని రక్షిస్తున్న నాయకుడు, పురాణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటూ టీజర్‌లో పేర్కొన్నారు. 

టీజర్‌ రిలీజ్‌
ఈ వీడియోలో గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. రాముడు శివధనస్సు విల్లు ఎత్తినట్లుగా, వనవాసం చేసినట్లు, యుద్ధం చేసినట్లుగా.. పలు ఘట్టాలను క్లుప్తంగా చూపించారు. అంటే అయోధ్య నుంచి అరణ్యం వైపు సాగిన ప్రయాణాన్ని, రాక్షసులతో జరిగిన యుద్ధాన్ని కూడా చూపించారు. ఇందులో కేవలం రాముడి పాత్రను మాత్రమే రివీల్‌ చేశారు. రావణుడు, సీతల పాత్రలను చూపించలేదు. కేవలం 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. 

సినిమా
చివర్లో రావణుడి ఫేస్‌ రివీల్‌ కాకుండా ఆయన ఆహార్యాన్ని వెనక నుంచి చూపించారు. అది ఈ గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి వీడియో అదిరిందని, తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించిందని సినీప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా యశ్‌ రావణుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న రామాయణ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. నమిత్‌ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హన్స్‌ జిమ్మర్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement