'అంత మాట అనేశారేంటి?'.. వారణాసి, రామాయణపై మనోజ్ షాకింగ్ కామెంట్స్ | Manoj Bajpayee comments on Varanasi and Ramayana Movies Budget | Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: వారణాసి, రామాయణ బడ్జెట్.. మనోజ్ భాజ్‌పేయి షాకింగ్ కామెంట్స్

Jun 5 2026 6:41 PM | Updated on Jun 5 2026 7:42 PM

Manoj Bajpayee comments on Varanasi and Ramayana Movies Budget

బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పేయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ నటించిన హ్యాపీ మూవీతో తెలుగు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో తన హావాభావాలు, నటనతో మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ భారీ బడ్జెట్ చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసి, రణబీర్ కపూర్-నితీష్ తివారీల 'రామాయణం చిత్రాలపై మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలపై వస్తున్న బడ్జెట్‌ వార్తలను ఆయన కొట్టిపారేశారు. వీటిని భారీ బడ్జెట్‌ చిత్రాలు అనడం కేవలం పీఆర్ స్టంట్‌లో భాగమేననని మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.  గత 15 ఏళ్లుగా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయని అన్నారు. సినిమా అనేది వ్యాపారమని.. బడ్జెట్ విషయం కేవలం నిర్మాతపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుడికి బడ్జెట్‌తో పనిలేదని.. సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. ఈ రెండు భారీ బడ్జెట్‌ చిత్రాలను ఉద్దేశించి మనోజ్ భాజ్‌పేయి చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

అయితే మనోజ్ ప్రస్తుతం ‘గవర్నర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈ మూవీకి బజ్ లేకపోవడంతో కేవలం ఆడియన్స్‌లో క్రేజ్‌ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మనోజ్ చేసిన వ్యాఖ్యలు భారీ బడ్జెట్‌ చిత్రాలపై చర్చకు దారితీశాయి. కాగా.. రాజమౌళి వారణాసి రూ. 1400 కోట్లు, రణ్‌బీర్‌ కపూర్ రామాయణ రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

మనోజ్ మాట్లాడుతూ..'అదంతా ఒక పీఆర్ ఎత్తుగడ. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇది ఎంతగా వ్యాపించిందంటే కొన్నిసార్లు విమానాశ్రయంలో నన్ను కలిసే ప్రేక్షకులు కూడా సినిమా వసూళ్ల గురించి మాట్లాడతారు. ఈ డబ్బు మీ సొంత ఖాతాల్లోకి వెళ్లడం లేదు. ఒకవేళ ఇది మీ ఖాతాలోకి వెళ్తుంటే అప్పుడు సినిమా బాక్సాఫీస్ వసూళ్ల గురించి మాట్లాడండి. ప్రేక్షకుడిగా మీకు ఆ సినిమా నచ్చిందా లేదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్తా. రూ.500-600 కోట్ల  బడ్జెట్‌ చిత్రాల్లో ఒక్క రూపాయి కూడా మీకు అందడం లేదు. ఇదే విషయం ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీకు సినిమా నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇతర విషయాలు ఆడియన్స్‌కు ముఖ్యం కాదు.  సినిమా వ్యాపారం అనేది కేవలం నిర్మాతకు సంబంధించింది మాత్రమే' ‍అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement