Dubai Open tennis tournament
-
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ రుతుజా భోస్లే దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతుజా (భారత్)–పీంగ్‌టార్న్ ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి రౌండ్లో రుతుజా–ప్లిపుయెచ్ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్)–ఫాంగ్ సియెన్ వు (చైనీస్ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీలో మ్యాచ్ గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్‌లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 120 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో యూకీ జోడీ
దుబాయ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. దుబాయ్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టో ర్నీలో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి యూకీ బాంబ్రీ పురుషుల డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ–పాపిరిన్ ద్వయం 6–2, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో 32 ఏళ్ల యూకీ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–500 స్థాయి టో ర్నీలో ఫైనల్‌కు చేరాడు. అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో యూకీ మూడు డబుల్స్ టైటిల్స్ సాధించి, మరో మూడు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. -
యూకీ బాంబ్రీకి నిరాశ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 3–6, 4–6తో ఒనీల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. -
సెమీఫైనల్లో ఓడిన సానియా జంట
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది. -
సానియా జంట పరాజయం
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–గార్సియా జంట 4–6, 2–6తో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)–బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మార్సెలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట 5–7, 7–6 (7/3), 8–10తో నీల్సెన్ (డెన్మార్క్)–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో బోపన్న జంట
దుబాయ్: భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్) ద్వయం 6–3, 6–4తో మెర్జియా (రొమేనియా)–ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై విజ యం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో బోపన్న–మట్కోవ్‌స్కీ 5–7, 6–3, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలిచారు.


