విశాఖ అంటేనే టీమిండియాకు ‘అచ్చొచ్చిన కోట’ అని మరోసారి రుజువైంది.
సముద్ర ఘోషను మించిన అభిమానుల హర్షధ్వానాలు..
స్టేడియం నలువైపులా మార్మోగిన ‘రో–కో’ నినాదాల నడుమ భారత జట్టు కదంతొక్కింది.
సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్‌లో సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.


