తండ్రికి సీరియ‌స్‌.. జ‌ట్టును వీడిన భార‌త ప‌వ‌ర్ హిట్ట‌ర్‌ | Father Suffering From Liver Cancer, Rinku Singh Leaves T20 World Cup Camp To Return Home | Sakshi
Sakshi News home page

T20 WC 2026: తండ్రికి సీరియ‌స్‌.. జ‌ట్టును వీడిన భార‌త ప‌వ‌ర్ హిట్ట‌ర్‌

Feb 24 2026 9:40 PM | Updated on Feb 24 2026 10:21 PM

Father Suffering From Liver Cancer, Rinku Singh Leaves T20 World Cup Camp To Return Home

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో జింబాబ్వేతో సూప‌ర్‌-8 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జ‌ట్టును వీడాడు. త‌న తండ్రి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బ‌య‌లు దేరి వెళ్లిపోయాడు.

దీంతో మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌కు రింకూ దూర‌మ‌య్యాడు. అత‌డు ఎప్పుడు తిరిగి వ‌స్తాడ‌న్న‌ది కూడా స్ప‌ష్ట‌త లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్‌పై చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ముందుగానే బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి.. డ‌కౌటై పెవిలియ‌న్‌కు చేరాడు.

అయితే సౌతాఫ్రికా చేతిలో భార‌త్ ఓట‌మి పాల్వ‌డంతో టీమిండియా త‌మ సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రగ‌నున్న మ్యాచ్ భార‌త్‌కు చాలా కీల‌కం. ఇటువంటి మ్యాచ్‌కు ముందు రింకూ జ‌ట్టును వీడ‌డం గ‌ట్టి ఎదురు దెబ్బ‌గానే చెప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement