Zimbabwe Vs Oman
-
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే
భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రూప్-సి నుంచి వెస్టిండీస్- స్కాట్లాండ్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్ ఇదేగ్రూప్-సి: స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్-బి: జింబాబ్వే వర్సెస్ ఒమన్- సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్-డి: సౌతాఫ్రికా వర్సెస్ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా.. గ్రూప్- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్, ఐర్లాండ్ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్ రేసులో ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్! -
T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్ జట్టు జోరు కనబరుస్తోంది. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేతో ఒమన్ గురువారం తలపడింది.బెనెట్, ముసేకివా హాఫ్ సెంచరీలుకొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ (28 బంతుల్లో 56) మెరుపు అర్ధ శతకం బాదగా... బ్రెండన్ టేలర్ (20 బంతుల్లో 26) రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన డియాన్ మేయర్స్ 26 పరుగులు చేయగా.. ర్యాన్ బర్ల్ (1), టోనీ మున్యోంగ (0), క్లైవ్ మండాడే (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోయర్ ఆర్డర్లో తషింగ ముసేకివా (28 బంతుల్లో 54 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక ఒమన్ బౌలర్లలో సూఫియాన్ మెహమూద్ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్ రెండు, షా ఫైజల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ 19.2 ఓవర్లలో పూర్తి చేసింది. జతిందర్, రామనంది ధనాధన్ఓపెనర్లలో ఆమిర్ కలీమ్ (23) ఫర్వాలేదనిపించగా.. జతిందర్ సింగ్ హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 55) చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. మిగిలిన వాళ్లలో హమాద్ మీర్జా (35), జితేన్ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయి ఒమన్ 188 పరుగులు సాధించింది. ఫలితంగా జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే పన్నెండో స్థానంలో ఉండగా.. ఒమన్‌ది ఇరవయ్యవ ర్యాంకు. కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి ఒమన్ గ్రూప్-బిలో ఉంది.చదవండి: పాక్‌తో మ్యాచ్.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్


