Scotland vs Italy
-
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో భాగంగా కోల్‌కతాలో సోమవారం ఇటలీతో తలపడింది స్కాట్లాండ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన ఇటలీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్కు ఓపెనర్లలో జార్జ్ మున్సే (54 బంతుల్లో 84) అదిరిపోయే ఆరంభం అందించగా.. మైకేల్ జోన్స్ (37) కూడా రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెండన్ మెక్ముల్లన్ (18 బంతుల్లో 41 నాటౌట్) ధనాధన్ దంచికొట్టగా.. ఆఖర్లో మైకేల్ లీస్క్ (5 బంతుల్లో 22 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 207 పరుగులు సాధించింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 200కు పైగా స్కోరు చేసిన తొలి అసోసియేట్ జట్టుగా స్కాట్లాండ్ చరిత్ర సృష్టించింది.McMullen charges out and pumps it clean over long-on for a glorious hit. 🙌Marching towards 200! 💪ICC Men’s #T20WorldCup | #SCOvITA | LIVE NOW 👉 https://t.co/iRy5VavUwZ pic.twitter.com/Ax7EvdDitH— Star Sports (@StarSportsIndia) February 9, 2026ఇక లక్ష్య ఛేదనలో ఇటలీ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జస్టిన్ మోస్కా (0), ఆంటోనీ మోస్కా (13) విఫలం కాగా.. జేజే స్మట్స్ 22 పరుగులు చేశాడు. హ్యారీ మానెంటి (25 బంతుల్లో 37), బెన్ మానెంటి (31 బంతుల్లో 52) రాణించినా.. మిగతా వారి నుంచి సహకారం లభించలేదు.73 పరుగుల తేడాతో ఓటమిఆరో స్థానం నుంచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లు స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 2, 0, 3*, 2, 0, 0, 0 స్కోర్లతో వెనుదిరిగారు. దీంతో 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి ఇటలీ ఆలౌట్ అయింది.ఫలితంగా స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాటిష్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మైకేల్ లీస్క్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వాట్ రెండు, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, ఒలివర్ డేవిడ్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అనూహ్య రీతిలో స్కాట్లాండ్ రేసులోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఈ జట్టు.. తాజాగా ఇటలీని ఓడించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే.. ఇటలీ ఐసీసీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.చదవండి: IND vs PAK: పాక్ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ -
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే
భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రూప్-సి నుంచి వెస్టిండీస్- స్కాట్లాండ్ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్ ఇదేగ్రూప్-సి: స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్-బి: జింబాబ్వే వర్సెస్ ఒమన్- సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్-డి: సౌతాఫ్రికా వర్సెస్ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా.. గ్రూప్- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్, ఐర్లాండ్ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్ రేసులో ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!


