మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్ తగలనుందని తెలుస్తుంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం
ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో జడేజా తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్‌లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో (8-0-44-0) సీన్ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.
ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్‌పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్‌ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్‌తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ జడేజాకు హోం గ్రౌండ్. కానీ, ఆ మ్యాచ్ తర్వాత జడేజా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
జడేజా ఫిట్‌గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా కామెంట్ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్‌పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్ పటేల్ ఇదివరకే కర్చీఫ్ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది.


