
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో (తొలి రోజు) టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ గాయం తీవ్రత అధికంగా ఉన్నా జట్టు అవసరాల దృష్ట్యా రెండో రోజు బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పంత్ సేవలు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్‌కీపింగ్ చేయడని బీసీసీఐ స్పష్టం చేసింది.
జట్టు అవసరాల దృష్ట్యా పంత్‌ను ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వాడుకున్నా, ఐదో టెస్ట్‌లో మాత్రం అతను బరిలోకి దిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నా, కవర్ ప్లేయర్ ఎంపిక తప్పనిసరి అవుతుంది.
నిన్నటి వరకు పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, తాజాగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి టెస్ట్ కోసం పంత్‌కు రీప్లేస్‌మెంట్‌గా తమిళనాడుకు చెందిన రైట్ హ్యాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ నారాయణన్ జగదీశన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
29 ఏళ్ల జగదీశన్ ఐపీఎల్‌లో సీఎస్‌కే, కేకేఆర్ తరఫున ఆడాడు. చివరిగా అతను 2023 సీజన్‌లో కేకేఆర్‌లో ఉన్నాడు. జగదీశన్ ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయిన దేశవాలీ క్రికెట్‌లో అద్భుతాలు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు ఇతని ఖాతాలో ఉన్నాయి. వికెట్‌కీపర్‌గానూ జగదీశన్‌కు మంచి రికార్డే ఉంది.