
త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు.
ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని మొహమ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. షమీ తన బెంగాల్ సహచరుడు ముకేశ్ కుమార్, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆకాశ్‌దీప్‌తో కలిసి పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు.
జట్టులో అసోం సారధి, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు సారధిగా ఎంపికైన ఇషాన్ ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో విశేషంగా రాణించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ను సంప్రదించినప్పటికీ.. అతను కూడా గాయంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్ జగదీశన్‌ను ఎంపిక చేశారు.
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ షమీ
స్టాండ్‌బై ప్లేయర్‌లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్