ఇషాన్ కిష‌న్.. నీకు కొంచ‌మైనా తెలివి ఉందా? వీడియో వైర‌ల్‌ | Ishan Kishan Falls Prey To Umpire's Howler Vs MI | Sakshi
Sakshi News home page

IPL 2025: ఇషాన్ కిష‌న్.. నీకు కొంచ‌మైనా తెలివి ఉందా? వీడియో వైర‌ల్‌

Apr 23 2025 8:37 PM | Updated on Apr 23 2025 8:50 PM

Ishan Kishan Falls Prey To Umpire's Howler Vs MI

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ ఔటైన విధానం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంపైర్ ఔట్ ఇవ్వ‌క‌పోయినా కిష‌న్ మాత్రం  త‌నంత‌ట తానే మైదానాన్ని వీడేందుకు సిద్దం కావ‌డం అంద‌ర‌ని షాక్‌కు గురిచేసింది.

అస‌లేమి జ‌రిగిందంటే?
ట్రావిస్ హెడ్ ఔట‌య్యాక క్రీజులోకి ఇషాన్ కిష‌న్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో 3వ ఓవ‌ర్ వేసిన దీప‌క్ చాహ‌ర్ తొలి బంతిని కిష‌న్‌కు లెగ్ సైడ్ వైపున‌కు సంధించాడు. ఆ బంతిని డౌన్ ది లెగ్ ఆడ‌టానికి ఇషాన్ ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి కిష‌న్ బ్యాట్ మిస్స్ అయ్యి వికెట్ కీప‌ర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. 

వెంట‌నే కిషన్ మాత్రం ఔట్ అని భావించి పెవిలియ‌న్‌కు వైపు న‌డిచాడు. అప్ప‌టికి బౌలర్, వికెట్ కీప‌ర్ క‌నీసం అప్పీల్ కూడా చేయ‌లేదు. ఎప్పుడైతే కిష‌న్ వెళ్లిపోవ‌డం చూసి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. కిష‌న్ ఏదో క్రీడా స్పూర్తి ప్ర‌ద‌ర్శించి వెళ్లిపోయాడ‌ని అంతా అనుకున్నారు. కానీ ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది. 

రిప్లేలో బంతి క‌నీసం బ్యాట్ కి గాని గ్లౌస్‌కి, బాడీ కి గానీ తగిలిన ఆనవాళ్లు రిప్లేలో క‌న్పించ‌లేదు. అత‌డు ఔటైన త‌ర్వాత ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దీంతో కిష‌న్‌పై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంచెం అయినా తెలివి ఉందా అంటూ పోస్టులు చేస్తున్నారు.  మ‌రి కొంత మంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement