రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.
అయితే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కిషన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కిషన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది తర్వాత తన హాఫ్ సెంచరీ మార్క్‌ను సూర్య అందుకున్నాడు. ఓవరాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం.
Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu
— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.


