ఐపీఎల్-2026 సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఎస్ఆర్‌హెచ్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనుంది. దీంతో టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు కమ్మిన్స్‌కు దూరంగా ఉన్నాడు. క్రమంలోనే కిషన్‌ను కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ యాజమాన్యం నియమించింది.
తొలిసారి అందరూ భారత కెప్టెన్‌లే..
సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను కెప్టెన్ ప్రకటించడంతో... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి బరిలో ఉన్న 10 జట్లకు భారత ప్లేయర్లే సారథులుగా కనిపించనున్నారు. గత 18 సీజన్‌లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటీదార్... ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్... గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుబ్‌మన్ గిల్... కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అజింక్య రహానే... రాజస్తాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్... ముంబై ఇండియన్స్‌కు హర్దిక్ పాండ్యా... పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్... లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.
ఇక ఎస్ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో లీగ్ ఆరంభం(మార్చి 28) రోజున చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది.


