
ఐపీఎల్-2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 18వ ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అయితే ఇంకా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇంకా జట్టుతో చేరలేదు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. కమ్మిన్స్ ఒకట్రెండు రోజుల్లో జట్టుతో చేరే అవకాశముంది.
ఇషాన్ కిషన్ విధ్వంసం..
ఇక ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రా-స్క్వాడ్ సిమ్యులేషన్ మ్యాచ్ ఆడింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎస్‌ఆర్‌హెచ్-ఎ, ఎస్‌ఆర్‌హెచ్-బి జట్లగా విడిపోయారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్-ఎకు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కిషన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.
ఈ క్రమంలో ఇషాన్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తంగా 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్ల తర్వాత వేరే ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఔటవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్-ఎ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది.
కిషన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11.25 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు.
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర వీరుడు!
Ishan Kishan scored a half-century in just 16 balls during SRH's intra-squad match😎📸💥@ishankishan51 #IshanKishan #SRH #IPL2025 #PlayWithFire pic.twitter.com/Vc1UiJAEZM
— Ishan's🤫🧘🧡 (@IshanWK32) March 15, 2025
ఐపీఎల్-2025కు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, కమిందు మెండిస్, సచిన్ హేషన్ బేబీ, అనికేత్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , నితీష్ కుమార్ రెడ్డి