ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్ 2026 సీజన్‌లో ఆరంభం రోజునే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ నేపథ్యంలోనే కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ వైస్ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అభిషేక్ సంగతి పక్కనబెడితే రిషబ్ పంత్,జితేశ్ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.
ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్ దూరమయ్యాడు. ఇక కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌లో కమిన్స్ సారథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ రన్నరప్‌గా నిలిచింది.
ఆ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్ నుంచి గేర్ మార్చిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్‌స్టోన్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్‌వర్డ్స్, అమిత్ కుమార్, క్రెయిన్స్ ఫెల్టూరా, సకిబ్ హుసేన్, ఒంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
Pat Cummins will miss a few games while recovering from injury.
Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026


