ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ
రాయికల్: రాయికల్ బల్దియాలో ఒకే ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు పోటీ చేస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లుతోపాటు ఆయన తమ్ముడి కుమారుడు మోర రాంమూర్తి బరిలో నిలి చారు. మోర హన్మండ్లు ఏడోవార్డులో బరిలో ఉండగా.. మోర రాంమూర్తి 12వ వార్డులో పోటీలో ఉన్నా రు. హన్మండ్లు రిటైర్డ్ లెక్చరర్ కావడంతోపాటు మొ దటి మున్సిపల్ చైర్మన్‌గా ప్రజలకు సేవలందించారు. హన్మండ్లు తమ్ముడు, స్వర్గీయ ఆంజనేయులు గతంలో ఎంపీపీగా పనిచేశారు. ఆయన కుమారుడు రాంమూర్తి మొదటిసారి 12వవార్డు నుంచి పోటీలో ఉన్నారు.


