కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

కలెక్

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే

జగిత్యాల: అన్నివర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం సోషల్‌ జస్టిస్‌ డే వేడుకలు నిర్వహించారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఇందులో భాగంగా ఈనెల 4న సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని నిర్ణయించిందన్నారు. సమసమాజ స్థాపనకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముందుగా విద్యార్థుల నృత్యాలు, కళాజాత బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌, సునీత, చిత్రు, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికల రెండో ర్యాండమైజేషన్‌ పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్నికల అబ్జర్వర్‌ సుదమరావు ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్‌ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ర్యాండమైజేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల అధి కారి రాము, కలెక్టరేట్‌ ఏవో హకీం పాల్గొన్నారు.

వైద్య సేవలపై ఆరా

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌లోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి నరేందర్‌ బుధవారం సందర్శించారు. కేంద్రంలోని వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాలపై తెలుసుకున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలు, టీకాల నిల్వలు, కోల్డ్‌చైన్‌ నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎన్‌ఎంలతో సమావేశమై సలహాలు, సూచనలు ఇచ్చారు. మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాల డీన్‌గా నీరజ

జగిత్యాలఅగ్రికల్చర్‌: పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌గా బోగ నీరజ నియమితులయ్యారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీన్‌గా భారతీనారాయణ్‌ భట్‌ పనిచేశారు. నీరజ గతంలో ఉద్యానవర్సిటీలో పనిచేశారు.

జేఎన్టీయూ విద్యార్థులకు త్రీడీ వర్క్‌షాప్‌

కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో వన్డే హ్యాండ్‌ ఆన్‌ వర్క్‌షాప్‌ త్రీడి ప్రింటింగ్‌, ఆప్టిట్యూడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ నిర్వహించారు. టీబీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిసోర్స్‌ పర్సన్‌గా రాకేష్‌ వ్యవహరించారు. బీటెక్‌ మెకానికల్‌ సెకండియర్‌, థర్డియర్‌, ట్రిపుల్‌ఈ థర్డియర్‌ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ రకాలైన నమూనాలను త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా తయారుచేశారు. అధ్యాపకులు ప్రతిభ కనబరచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నరసింహ, వైస్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే
1
1/3

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే
2
2/3

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే
3
3/3

కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement