కోరుట్ల చెక్‌పోస్టు..కాంచీట్‌ | - | Sakshi
Sakshi News home page

కోరుట్ల చెక్‌పోస్టు..కాంచీట్‌

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

కోరుట్ల చెక్‌పోస్టు..కాంచీట్‌

కోరుట్ల చెక్‌పోస్టు..కాంచీట్‌

కోరుట్ల: 1957 సంవత్సరం నాటికే కోరుట్ల పట్టణం నగర పంచాయతీ. ఆ రోజుల్లో సరుకుల అమ్మకాలకు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చేవారికి పట్టణ శివారులో చెక్‌పోస్టు ఉండేది. ఆ చెక్‌పోస్ట్‌ ప్రస్తుత చాకలి అయిలమ్మ విగ్రహం నుంచి లక్ష్మీ టాకీస్‌ ఏరియా వరకు ఉండేది. ఆ రోజుల్లోనే కొంచెం పెద్ద పట్టణంగా గుర్తింపు ఉన్న కోరుట్లకు పక్క నే ఉన్న గ్రామాల నుంచి కూరగాయలు, మొ క్కజొ న్నలు, వడ్లు వంటి సరుకుల అమ్మకానికి చెక్‌పోస్టు నుంచే వచ్చేవి. దీనికి కాస్త పక్కన మెయిన్‌ రోడ్డు వెంట గూనపెంకులతో నగర పంచాయతీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఆ పాత కార్యాలయాన్నే పాత మున్సిపాలిటీగా పిలుచుకుంటున్నారు.

అర్ధరూపాయి.. అమ్మకానికి చీటీ

ఆ కాలంలోనే బల్దియాగా గుర్తింపు పొందిన కోరుట్లకు రావడానికి ప్రధాన రహదారి కాంచీట్‌ ఏరియా. ఆ కాలంలో అది నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. బల్దియా సిబ్బంది అక్కడే ఉండి కోరుట్లకు స రుకులు అమ్ముకోవడానికి వచ్చే వారి నుంచి రోజు కు అర్ధ రూపాయి తీసుకుని చీటీ ఇచ్చి అనుమతించేవారు. మరుసటి రోజు మళ్లీ సరుకులు అమ్ముకోవడానికి వస్తే మళ్లీ బల్దియా పన్ను వసూలు చేసే వా రు. సరుకుల అమ్మకాలకు కోరుట్లకు వచ్చే వారు కాంచీట్‌ ఏరియా నుంచి అయిలాపూర్‌ దర్వాజా మీ దుగా శ్రీవేంకటేశ్వరాలయం, కాల్వగడ్డ ఏరియాలో ఉన్న మార్కెట్‌ వద్ద సరుకులు అమ్ముకుని వెళ్లేవారు.

సైకిల్‌.. ఎడ్లబండ్లకు బిళ్లలు

ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌తోపాటు ఇతరత్రా చార్జీలను ఆర్టీవో కార్యాలయం అధికారులకు చెల్లిస్తామో.. అదే రీతిలో ఆ కాలంలో కొత్త సైకిల్‌ కొన్నా.. ఎండ్లబండి చేయించుకున్నా బల్దియా నుంచి సీమెండి బిల్లలు ఇచ్చేవారు. ఇందుకు సైకిళ్లకు రూ.5, ఎడ్లబండికి రూ.7 వసూలు చేసేవారు. ఒక్కసారి వాహనానికి పన్ను చెల్లిస్తే జీవితకాలం అనుమతి ఉండేది. బల్దియా బిళ్ల లేని సైకిల్‌, ఎడ్లబండి కనిపిస్తే రూ.10వరకు జరిమానా వేసేవారు. ఆ కాలంలో పొలాల్లో, చేలలో పశువులు మేస్తే వాటిని బంధించి ఉంచడానికి కోరుట్లలోని ఆరు ప్రాంతాల్లో బంజరుదొడ్డి ఉండేవి. వాటి విడిపించుకోవాలంటే ఒక్కో ఆవు, బర్రెకు రూ.10 పన్నుగా వసూలు చేసే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం బల్దియా పరిధిలో ఉన్న ఆ బంజరుదొడ్ల స్థలాలు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బల్దియాకాలం నాటి ముచ్చట్లను సీనియర్‌ సిటిజన్‌ గొనె శంకర్‌ వివరించారు.

నాడు సరుకుల రాకపోకల దారి

అక్కడే బల్దియా పన్ను వసూలు

సైకిళ్లు, ఎడ్లబండ్లకు మున్సిపల్‌ బిళ్ల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement