● ప్రజలతో సత్సంబంధాలు అత్యధికంగా ఉండేవి ప్రత్యక్ష ఎన్ని
జగిత్యాల: గతంలో మున్సిపల్ చైర్మన్‌కు ప్రత్యక్షంగానే ఎన్నికలు ఉండేవి. ప్రస్తుతం పరోక్షంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్లే డబ్బు ఖర్చు ఎక్కువగా పెరిగిపోయింది. నాడు ఉత్తర తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచాను. నా రాజకీయ గురువు జీవన్‌రెడ్డి. మొదటగా 1988లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసి గెలిచాను. అనంతరం నాకు 1995లో చైర్మన్ టికెట్ ఇచ్చి గెలిపించారు. నేరుగా చైర్మన్ కావడంతో ప్రజలతో అత్యధికంగా సంబంధాలు ఉండేవి. ప్రజల సమస్యలు తెలుసుకుని జగిత్యాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా విద్యానగర్‌లో వాటర్‌ట్యాంక్ కట్టించా. వీక్లీబజార్‌లో కాంప్లెక్స్ కట్టించా. చింతకుంటలో శ్మశాన వాటిక కట్టించా. ప్రతి గల్లీలో సీసీరోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్న. చరిత్రలో నిలిచేలా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాను. కానీ ఇప్పుడు పరోక్ష ఎన్నికలు కావడంతో ఖర్చు అత్యధికంగా పెరిగింది. అందరు కౌన్సిలర్లు కలిసి చైర్మన్‌ను ఎన్నుకోవడం ద్వారా ఖర్చు పెరుగుతుంది. డబ్బుతో రాజకీయం ముడిపడి ఉంది. అప్పుడు అభివృద్ధి చూసి ఓటు వేసేవారు. ఇప్పుడు డబ్బే ప్రభావం చూపుతోంది.
‘ఇప్పుడు రాజకీయాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు ఉన్న వారికే పదవులు దక్కుతున్నాయి. ఆ రోజుల్లో ప్రతిఒక్కరికీ పదవులు దక్కేవి. ఇప్పటికి.. అప్పటికి చాలా తేడా ఉంది. నాడు సేవభావంతో స్వార్థం లేకుండా పనిచేసేవాళ్లం..’ అన్నారు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మెట్టబట్టి. ఆయన 1995–2000 సమయంలో చైర్మన్‌గా కొనసాగారు. ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయం పంచుకున్నారు.


