● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి: మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు బల్దియాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలో శనివారం బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. 15వార్డులకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసి ఒక్కో వార్డుకు వైస్ ఇన్‌చార్జిలను ప్రకటించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ ధర్మపురి అభివృద్ధికి కోట్లాది నిధులు విడుదల చేశారని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.


