జంతువులపై ప్రేమ పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జంతువులపై ప్రేమ పెంచుకోవాలి

Feb 1 2026 3:17 AM | Updated on Feb 1 2026 3:17 AM

జంతువ

జంతువులపై ప్రేమ పెంచుకోవాలి

జగిత్యాలఅగ్రికల్చర్‌: జంతువులపై ప్రతిఒక్క రూ ప్రేమ, అనురాగం కలిగి ఉండాలని అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌.లత అన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని పురాణిపేట జెడ్పీ హైస్కూల్‌లో శనివారం నిర్వహించారు. జంతువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పక్షోత్సవాలు నిర్వహించామన్నారు. పశువులకు సరైన ఆహారం, తాగునీరు అందించాలన్నారు. అనంతరం చిత్రలేఖనం, వ్యాసరచనలో గెలుపొంది న విద్యార్థులకు బహుమతులు అందించా రు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికా రి బి.ప్రకాశ్‌, ఏడీ మదన్‌మోహన్‌, పశువైద్యాధికారులు గడ్డం నరేష్‌, డాక్టర్‌ వాసు, పావని, పాఠశాల హెచ్‌ఎం తిరుపతి పాల్గొన్నారు.

ఘనంగా మల్లికార్జునస్వామి ఉత్సవాలు

మల్లాపూర్‌: రత్నాపూర్‌ శ్రీమల్లికార్జునస్వామి మహోత్సవాలను శనివారం సంగెంశ్రీరాంపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అర్చకులు కుడకల శివకుమార్‌, రత్నాపూర్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ కూచన్‌పెల్లి శ్రీనివాస్‌, హిందూ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి

జగిత్యాలక్రైం: ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని తహసీల్‌చౌరస్తాలో పోలీస్‌శాఖ, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్‌ నియమాలు, హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కువశాతం ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ప్రధాన కారణం హెల్మెట్‌ ధరించకపోవడమేనన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. డీఎస్పీ రఘుచందర్‌, టౌన్‌ సీఐ కరుణాకర్‌, డీటీవో శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఎస్సై మల్లేశం, ఎంవీఐలు వెంకన్న, అభిలాష్‌, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

వెల్గటూర్‌: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ జైనపురం సాయికుమార్‌ తెలిపారు. వనం అఖిల, బాస శ్రీజలు డిసెంబర్‌ 12వ తేదీ నుంచి 14వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్‌ అండర్‌–19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల ఒకటి నుంచి ఐదో తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘుమన్విన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్‌ తెలిపారు. వీరి ఎంపికపై హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి జిట్టవేణి శ్రీనివాస్‌, ట్రెజరర్‌ కలిగేటి శ్రీనివాస్‌, జెట్టిపల్లి అశోక్‌, సర్పంచ్‌ గొల్లపల్లి మల్లేశం, ఉప సర్పంచ్‌ అరిగెల జయవ్వ, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

జంతువులపై ప్రేమ   పెంచుకోవాలి1
1/3

జంతువులపై ప్రేమ పెంచుకోవాలి

జంతువులపై ప్రేమ   పెంచుకోవాలి2
2/3

జంతువులపై ప్రేమ పెంచుకోవాలి

జంతువులపై ప్రేమ   పెంచుకోవాలి3
3/3

జంతువులపై ప్రేమ పెంచుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement