కేసీఆర్‌పై వేధింపులకు నిరసనగా ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై వేధింపులకు నిరసనగా ఆందోళనలు

Feb 1 2026 3:17 AM | Updated on Feb 1 2026 3:17 AM

కేసీఆర్‌పై వేధింపులకు   నిరసనగా ఆందోళనలు

కేసీఆర్‌పై వేధింపులకు నిరసనగా ఆందోళనలు

జగిత్యాల: మాజీ సీఎం కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడిని ఇబ్బందులకు గురిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి కుట్రలకు తెరలేపిందన్నారు. రమణ మాట్లాడుతూ సిట్‌ పేరుతో కేసీఆర్‌ను వేధిస్తున్నారని, ఇందుకు నిరసనగా ఆదివారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వ వైఖరి మొండి వైఖరిని ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement