● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్పంగా ఒకటే.. | - | Sakshi
Sakshi News home page

● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్పంగా ఒకటే..

Feb 1 2026 3:17 AM | Updated on Feb 1 2026 3:17 AM

● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్

● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్

● దర్మపురిలో అత్యధికంగా 39 తిరస్కరణ ● జగిత్యాలలో అత్యల్పంగా ఒకటే..

జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. జగిత్యాలలో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక్కడ మొత్తం 50 వార్డులకు 361మంది 533 నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నిర్వహించిన స్క్రూటినీలో 43వ వార్డు కరండ్ల మహేశ్‌ రెండుసెట్లు దాఖలు చేయడంతో ఒక నామినేషన్‌ తిరస్కరించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన తెలిపారు. మొత్తం 532 నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. బీజేపీ 121, కాంగ్రెస్‌ 241, బీఆర్‌ఎస్‌ 102, ఎంఐఎం 17, ఇతర పార్టీలు 13, స్వతంత్రులు 38 మొత్తం 532 నామినేషన్లు ఆమోదం పొందాయి.

ధర్మపురిలో 39..

ధర్మపురి: మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు 73 మంది అభ్యర్థులు 113 నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నిర్వహించిన పరిశీలనలో 39 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 74 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రాయికల్‌లో మూడు..

రాయికల్‌: బల్దియాలోని 12 వార్డులకు 100 మంది నామినేషన్లు వేశారు. శనివారం నిర్వహించిన స్క్రూటినీలో 7వ వార్డు నుంచి ఎలిగేటి అనిల్‌కుమార్‌ రెండు, మూడోవార్డు నుంచి ఆత్రం శంకర్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కీర్తి నాగరాజు తెలిపారు. బీజేపీ 18, కాంగ్రెస్‌ 26, బీఆర్‌ఎస్‌ 18, జనసేన 6, స్వతంత్రులు 3, డబుల్‌ నామినేషన్లు 26 ఉండగా.. మొత్తం 71 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియను జెడ్పీ సీఈవో, బల్దియా స్పెషల్‌ ఆఫీసర్‌ గౌతమ్‌రెడ్డి పరిశీలించారు.

మెట్‌పల్లిలో రెండు..

మెట్‌పల్లి: మున్సిపాలిటీకి మొత్తం 291 నామినేషన్లు దాఖలు కాగా.. రెండు నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్‌ మోహన్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం వివరాలు పొందుపర్చకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

కోరుట్లలో నిల్‌..

కోరుట్ల: బల్దియాలోని 33వార్డులకు 190 మంది నామినేషన్లు వేయగా.. అన్నీ ఆమోదం పొందినట్లు కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement