అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న
జగిత్యాల: అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల మున్సిపాలిటీకి రూ. 62.5 కోట్లు మంజూరు చేయించానని, కాంగ్రెస్ సీని యర్ నాయకులు తనపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం మోతె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జగిత్యాలలో సరైన మాస్టర్ ప్లాన్ లేక ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని, ఇది గత అధి కారులు, పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. ఎల్‌ఎల్ గా ర్డెన్స్ సమీపంలో కనీసం రోడ్డు లేకపోతే రూ.కోటి పెట్టి భూమిపూజ చేస్తే సీనియర్ నాయకులు పరి శీలించకుండానే సరిగా లేదని విమర్శలు చేసి చివరికి అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంట్రాక్టర్‌కు రూ.9 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాంటి సమాచారం లేకుండా విమర్శించడం మానుకోవాలన్నారు. తన పై బురదచల్లే ప్రయత్నం చేస్తూ వారి హోదాను వారే తగ్గించుకుంటున్నారన్నారు. ఇప్పటికీ ఆయనపై గౌరవం ఉందని, ప్రజలు దానిని గమనిస్తున్నారన్నారు. గతంలో రోడ్లు భవనాల మంత్రిగా ఉండి అనంతారం బ్రిడ్జి శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. అప్పటి ఎంపీ కవిత సహకారంతో 4,500 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించి ని ర్మించడం జరిగిందన్నారు. కవిత ఓటమికి తాను కా రణమంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, అనవసర ఆరోపణలు మాని జగిత్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మ న్లు గిరి నాగభూషణం, జ్యోతి, గట్టు సతీశ్, దామోదర్‌రావు, జిలాని, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


